HomeతెలంగాణDK Aruna :Corruption is not tolerated in the Censor Office : DK...

DK Aruna :Corruption is not tolerated in the Censor Office : DK Aruna :సెన్సార్ ఆఫీసులో అవినీతిని సహించం

– అలాంటి వార్తలు రావడం దురదృష్టకరం
– నటుడు విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ముబయి ఆఫీసులో అవినీతి పేరుకుపోయిందని నటుడు విశాల్‌ చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా పోస్ట్‌ పెట్టింది. ఈ విషయంపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు తెలిపింది. ‘సెన్సార్‌ ఆఫీసులో అవినీతి జరిగినట్టు వార్తలు రావడం దురదృష్టకరం. అవినీతిని ప్రభుత్వం ఏమాత్రం సహించదు. ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడినట్టు తెలితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి ఈ విషయంపై నేడు విచారణ జరపనున్నారు’అని తెలిపింది. ‘మార్క్‌ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని నటుడు విశాల్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ఆ సినిమా సెన్సార్‌ కోసం దాదాపు రూ.6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన తెలిపారు. ‘ అవినీతి గురించి తెరపై చూడడం ఓకేగానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముంబయి సెన్సార్‌ ఆఫీస్‌లోనూ ఇది జరుగుతోంది. నా ‘మార్క్‌ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ పనులు పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులకు రూ. 6.5 లక్షలిచ్చా (స్క్రీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం రూ. 3 లక్షలు. నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మరో దారిలేక డబ్బులివ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతకూ ఇలా జరగకూడదు. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా’అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ మేరకు ఆ ఇద్దరి ట్విట్టర్​ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. ఎవరెవరికి డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలనూ పోస్ట్‌లో పెట్టారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర సమాచార శాఖ తాజాగా స్పందించింది.

Recent

- Advertisment -spot_img