– పార్టీ మారబోతున్నానంటూ మీడియాలో తప్పుడు ప్రచారం
– మోడీ నాయకత్వంలో పనిచేయాలంటూ అదృష్టం ఉండాలి
– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. డీకే అరుణ పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. దీంతో అరుణ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని, మోడీ నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలని అన్నారు. కనీసం తన స్పందన తీసుకోకుండా వార్తా కథనాలు రాయడం సరైంది కాదని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారంటూ కాంగ్రెస్‌లో తన చేరికపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ హెచ్చరించారు.