సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ దుమ్ముదులిపాడు. ఊచకోత కోశాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 83 పరుగులతో చిన్నస్వామి స్టేడియాన్ని అభిమానుల కేరింతలతో హోరెత్తించాడు. వచ్చిన బంతిని వచ్చినట్లుగా స్టాండ్స్‌లోకి పంపుతూ కా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఫీల్డర్లు ప్రేక్షకులుగా అయిన వేళ ఆడియన్స్ క్యాచ్‌ల కోసం ఎగబడ్డారు. మ్య చ్ అనంతరం కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘గత మ్యాచ్‌లో ఓ కెప్టెన్ రానున్న టీ20 వరల్డ్ కప్‌లో నా చోటు గురించి ప్రస్తావించాడు. బాగా ఆడు. జట్టులో స్థానం సంపాదించాలి. అని నన్ను ప్రోత్సహించాడు. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. అతను ఈ మ్యాచ్ కూడా చూశాడని నేననుకుంటున్నా. వరల్డ్ కప్‌లో ఆడటానికి నేను రెడీ.’ అని నవ్వుతూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అయితే భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది.