టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి మాజీ ఆటగాడు దినేశ్ కార్తిక్ ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. టీమిండియా ఆటగాళ్లలో విరాట్ ఒకరే ఏలియన్స్ ఉన్నాయని నమ్మేవారని తెలిపారు. గ్రహాంతర వాసుల పట్ట కోహ్లీకి ఆసక్తి ఎక్కువ అని, ఓసారి అమెరికాలో గ్రహాంతర వాసులు కనిపించారని యూట్యూబ్‌లో వచ్చిన వీడియోను కోహ్లీ తనకు చూపించారని పేర్కొన్నారు.