Homeహైదరాబాద్latest Newsఆ రెండ్రోజులు సభ పెట్టకుండ్రి సార్​

ఆ రెండ్రోజులు సభ పెట్టకుండ్రి సార్​

అసెంబ్లీలో మల్లారెడ్డి ఫుల్ కామెడీ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మల్లారెడ్డి కామెంట్లు ఏ రేంజ్​లో నవ్వులు పూయిస్తాయో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పే డైలాగ్స్​ నిత్యం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతూఉంటాయి. ఆయన తన కామెంట్ల ద్వారానే ఫుల్​ ఫేమస్​ అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా మల్లారెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్లు మరోసారి సభ్యులను కడుపుబ్బా నవ్వేలా చేశాయి. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో నీటి పారుదల ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య హాట్ హాట్ డిస్కషన్​ సాగిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెళ్లిల్లు ఉన్నాయి కనుక.. తమకు సెలవులు ఇవ్వాలని.. ఆ రెండ్రోజులు సభను నడిపించొద్దని స్పీకర్​ కు విజ్ఞప్తి చేశారు. దీంతో సభ్యులంతా గొల్లున నవ్వారు. గత అసెంబ్లీలోనూ ఎన్నో సార్లు నవ్వులు పూయించిన మల్లన్న తాజాగా అదే ట్రెండ్​ కొనసాగించారు.

Recent

- Advertisment -spot_img