ఆధార్ కార్డు భారతీయ పౌరులకు ముఖ్యమైన పత్రం అని అందరికీ తెలిసిందే. మొదట్లో దీనిని గుర్తింపు కార్డుగా మాత్రమే పరిగణించేవారు. కానీ కాలక్రమేణా దాని ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది. అయితే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఆధార్ వివరాలు చోరీ చేసి కేటుగాళ్లు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. ఆధార్ వివరాలను బహిరంగంగా షేర్ చేయవద్దు. ముఖ్యంగా Fb, Instagram వంటి పబ్లిక్ డొమైన్లో పోస్ట్ చేయకూడదు. ఆధార్ లెటర్, PVC కార్డ్ లేదా కాపీలను ఎట్టిపరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో పడేయకూడదు. ఆధార్ OTPలను ఎవ్వరికీ షేర్ చేయవద్దు. మీ m-Aadhaar PINను ఎవరితోనూ పంచుకోవద్దు.
ALSO READ: Raithu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలోకి ఆరోజే ..!!