పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల ఇప్పుడు ఉరిసిల్లగా మారుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోందన్నారు. తన మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టొద్దు సీఎంగారూ. తమ కన్నా ఎక్కువ మంచి చేసి వారి ప్రాణాలు నిలబెట్టండని Xలో ట్వీట్ చేశారు.