Homeహైదరాబాద్latest Newsమీడియాను అడ్డం పెట్టుకున్న బ్లాక్ మెయిలర్ కు ఓటేయొద్దు

మీడియాను అడ్డం పెట్టుకున్న బ్లాక్ మెయిలర్ కు ఓటేయొద్దు

ఇదే నిజం, నల్గొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించిన నల్లగొండ -ఖమ్మం -వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా గొంతుక విప్పే ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వాన్ని నిలదీసే వారు కావాలి. ప్రశ్నించేవారు కావాలి అని నల్లగొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రులను కోరారు. అరచేతిలో వైకుంఠం చూపించే వారికి ఓటేద్దామా లేక పది సంవత్సరాలు నిజాయితీగా పనిచేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన కేసీఆర్ అభ్యర్థికి ఓటేద్దామా? ఆరు నెలల్లో అందరినీ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మే 27 న రాకేష్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

అయోగ్యుడు, బ్లాక్ మెయిలర్ కు అవకాశం ఇవ్వకండి. 56 క్రిమినల్ కేసులు ఉన్న మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏ విధంగా ప్రకటిస్తుందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా తెలంగాణలో 80 నుంచి 85% పండే దొడ్డు వడ్లకు కాకుండా సన్న వడ్లకు బోనస్ ఏవిధంగా ప్రకటిస్తారన్నారు. ప్రజలను మోసం చేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ సన్యాసులకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img