ఇదేనిజం, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్ పరిస్థితి డూ ఆర్ డై గా మారింది. గ్రూప్ దశను దాటి సూపర్ – 8 కు క్వాలిఫై కావాలంటే మిగిలిన రెండు మ్యాచులు తప్పక గెలవాల్సి ఉంది. కెనడా, ఐర్లాండ్‌తో జరిగే గేమ్స్‌లో భారీ నెట్‌రన్ రేట్ తో గెలవాలి. ఇంకా యూఎస్‌ఏ తాను ఆడబోయే మిగతా రెండు మ్యాచుల్లోనూ భారీ తేడాతో ఓడిపోవాలి. యూఎస్‌ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా పాకిస్తాన్ టోర్నీ నిష్క్రమిస్తుంది. ఫిట్‌నెస్ కోసం ఇటీవలే ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకున్న పాకిస్తాన్ టీం దారుణంగా విఫలమవుతుండటంతో అభిమానులు నిరాశ చెందారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్ ఆట ఇదేనా అంటూ నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోతుండటం ఆ జట్టుకు తలనొప్పిగా మారింది. ఓటమి అంచున ఉన్న గేమ్స్‌ని కూడా తమవైపు తిప్పే సత్తా ఉన్నా కీలక సమయాల్లో చేతులెత్తేయడం పాక్ శిబిరాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. రెట్టించిన ఉత్సాహంతో Pakistan మిగతా రెండు మ్యాచ్‌లు గెలుస్తుందా?
ఆడినె రెండు మ్యాచుల్లోనూ గెలిచిన ఆతిథ్య జట్టు యూఎస్‌ఏ మంచి ఫాంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఒకటి గెలిచినా సరిపోతుంది. ఒకవేళ రెండింటిలో ఓడినా పాకిస్తాన్ నెట్‌రన్ రేట్ కంటే తక్కువగా ఉండకుండా జాగ్రత్తపడాలి. ఈ క్రమంలోనే టీమిండియా అభిమానులు పాకిస్తాన్ సూపర్ 8 కు క్వాలిఫై కాకూడదని కోరుకుంటున్నారు. ఒకవేళ క్వాలిఫై అయితే మళ్లీ సెమీస్‌లో తలపడే అవకాశం ఉంటుంది. సెమీస్‌లో పాక్ చేతిలో ఓడిపోతే పరువు పోతుందని ఇప్పుడే పాక్‌ను ఇంటికి పంపాలని అనుకుంటున్నారు. మరికొందరేమో మొన్న జరిగిన మ్యాచ్‌లాగానే మరో మ్యాచ్ కావాలని కోరుకుంటున్నారు. పాక్ సెమీస్ దాకా వచ్చి మళ్లీ ఇండియా చేతిలో ఓటమి పాలవ్వాలని ఆశిస్తున్నారు.