కొంతమంది జ్వరం వచ్చినప్పుడు స్వీయ వైద్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు చల్లటి స్నానం చేస్తే వణుకు వస్తుందని అలాగే మీ శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని తెలిపారు. కెఫిన్ కలిగిన పానీయాలు తాగవద్దు. ఇవి శరీరంలో నిర్జలీకరణానికి కారణమవుతాయి. టివల్ల బాడీ డీహైడ్రేషన్కి గురవుతుంది. చాలామంది జ్వరం వస్తే దుప్పటి కప్పుకొని పడుకుంటారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వాలి. మంచి పోషకాహారం తినాలి.