Homeహైదరాబాద్latest Newsప్రతిరోజూ మీరు ఒక గ్లాసు వైన్ తాగుతున్నారా.. ఇది ఆరోగ్యానికి మంచిదా.. లేదా హానికరమా..?

ప్రతిరోజూ మీరు ఒక గ్లాసు వైన్ తాగుతున్నారా.. ఇది ఆరోగ్యానికి మంచిదా.. లేదా హానికరమా..?

వైన్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసు. అయితే తాజా పరిశోధనలో ఓ ప్రత్యేకత వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ ఒక గ్లాసు వైన్ తాగడం వల్ల కొన్ని వ్యాధుల ప్రమాద స్థాయిని తగ్గించవచ్చు, కాబట్టి వైన్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

1.గుండె ఆరోగ్యం : రెడ్ వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2.ఎముకల బలం : వైన్ తీసుకోవడం వల్ల ఎముకల ఖనిజ సాంద్రత పెరగడం ద్వారా ఎముకలు బలపడతాయి. వైట్ వైన్ కంటే రెడ్ వైన్ ఎక్కువ ప్రయోజనకరం.
3.గట్ హెల్త్ : వైన్‌లోని పాలీఫెనాల్స్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తాయి, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
4.బ్రెయిన్ హెల్త్: రెడ్ వైన్‌లో రెస్వెరాట్రాల్ ఉంటుంది, ఇది మెదడుకు జరిగే నష్టాన్ని నియంత్రిస్తుంది. వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వైన్ మితంగా తీసుకోవాలి. అతిగా మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలుంటాయి. పురుషులు రోజుకు రెండు గ్లాసుల వైన్ మరియు మహిళలు రోజుకు ఒక గ్లాసు వరుకు తాగవచ్చు అని నిపుణలు చెబుతున్నారు.

    Recent

    - Advertisment -spot_img