Health: పెరుగు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలు ఉండవని నిపుణులు చెబుతోంది. అయితే పెరుగు తిన్న వెంటనే చల్లటి నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని అంటున్నారు. పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, ఉబ్బరం వంటివి రావచ్చు. ఇది కడుపులో ఆమ్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది మరియు పెరుగులోని ప్రోబయోటిక్ లక్షణాలను తగ్గిస్తుంది. దీంతో పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గుతాయి. అందుకే, పెరుగు తిన్న తర్వాత కనీసం అరగంట వరకు నీరు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.