Homeహైదరాబాద్latest Newsమీకు రేషన్ కార్డు ఉందా.. నిరుద్యోగులకు శుభవార్త..!

మీకు రేషన్ కార్డు ఉందా.. నిరుద్యోగులకు శుభవార్త..!

మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే శుభవార్త. మీరు ఇంటి దగ్గర లోనే ఆ కోర్సుపై యువతకి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఎస్‌బీఐ ఆర్‌సెటి కీలక ప్రకటన చేసింది. వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎస్‌బీఐ ఆర్‌సెటి (గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ) తిమ్మాపూర్ మండలంలోని మహాత్మనగర్‌లో ఉంది. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కంప్యూటర్ టాలీ కోర్సుపై ఒక నెలపాటు ఉచిత శిక్షణ ఉంటుంది. ఈ ఉచిత శిక్షణ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి ఆసక్తిగల యువత పత్రాలను సిద్ధం చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img