ఇదే నిజం, తెలంగాణ: సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పే దమ్ము కిషన్ రెడ్డికి ఉందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్‌తోనే ఉన్న పద్మారావు గౌడ్‌కు 60 వేల మెజార్టీ ఇవ్వాలని ఆయన కోరారు. పద్మారావు గౌడ్ కేసీఆర్‌కు తమ్ముడి లాంటి వారన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్ మండి డివిజన్‌లలో శుక్రవారం జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
2014లో బడే భాయ్ మోడీ చాలా కథలు చెప్పారని.. రూ. 15 లక్షలు, ప్రతి ఒక్కరికి ఇళ్లు, ప్రతి ఇంటికి నల్లా, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ ట్రైన్ అని పెద్ద పెద్ద బిల్డప్‌లు ఇచ్చారని విమర్శించారు. కిషన్ రెడ్డి ఎంపీ, కేంద్రమంత్రి అయ్యి ఐదేళ్లు అయ్యిందని.. పైసా పని చేయలేదన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి ఇవ్వలేదన్నారు. ‘గుజరాత్లో వరదలు వస్తే మోడీ ప్రత్యేక విమానం వేసుకొని పోయి వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. గుజరాత్ వాళ్లే ప్రజలా ? హైదరాబాద్ వాళ్లు ప్రజలు కాదా?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంట్, నీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీలో చేరడని గ్యారంటీ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.