Homeహైదరాబాద్latest Newsరూ.10 వేలకు బైక్..ఎక్కడో తెలుసా?

రూ.10 వేలకు బైక్..ఎక్కడో తెలుసా?

ఇదే నిజం, జోగిపేటః ఒక్క బైకు రూ.10, రూ.15 వేలకే …ఇంత తక్కువ ధరకు ఎలా? ఎక్కడ దొరుకుతుందని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే. 2020 సంవత్సరం మోడల్‌ బైకు కూడా అదే రేటుకు లభిస్తుంది. అది ఎక్కడంటే సంగారెడ్డి జిల్లా అందోలు మండలం అక్సాన్‌పల్లి గ్రామంలో తక్కువ ధరకే లభిస్తాయి. రెండు మూడు నెలల్లోనే 10 బైకులను కారు చౌకగా అమ్మేసారు స్థానిక ముఠా సభ్యులు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన ఇస్మాయిల్‌ అనే వ్యక్తి అక్సాన్‌పల్లిలో ఉన్న బాబా అనే బంధువు ద్వారా శ్యాం అనే వ్యక్తికి పరిచయమయ్యాడు. రెండు, మూడు మాసాలుగా సాగుతున్న ఈ వ్యవహరం తీగ లాగితే డొంక కదిలింది. ఒక్క బైకు దొంగతనం సంఘటనలో ఇరువురి మద్య జరిగిన వివాదం పోలీస్‌స్టేషన్‌కు వరకు వెళ్లింది. గత మూడు నెలలుగా జరుగుతున్న దొంగ బైకుల విక్రయాల విషయం బయటపడింది.

ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందోలు మండలం బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద గత బుధవారం జరిగిన సంతలో అక్సాన్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడు బైకును ఎత్తుకెళ్లడం, బైకు యజమాని ఎవరు ఎత్తుకెళ్లారన్న విషయమై ఆరా తీయగా అక్సాన్‌పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌ అనే యువకుడు తీసుకువెళ్లినట్లుగా సమాచారం లభించింది. గట్టిగా మందలించగా తనకు శ్యాం అనే వ్యక్తి చెబితేనే ఎత్తికెళ్లినట్లుగా చెప్పాడు, బైకు యజమాని, బాబా, శ్యాంలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. గత మూడు మాసాలుగా దొంగ బైకులు గ్రామానికి వస్తోన్న అసలు విషయాన్ని బయట పెట్టుకున్నారు. దీంతో దొంగ బైకుల విక్రయాల విషయం బయటకు రావడంతో జోగిపేట పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు ఏడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు వాహనాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .ఈ విషయమై పోలీసుల వివరణ కోరగా విచారణ జరుగుతుందని, దొంగ బైకుల విక్రయాలు జరుగుతున్న విషయం వాస్తవమని పోలీసులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img