Homeహైదరాబాద్latest Newsఛత్రపతి నటుడు భార్య గురించి మీకు తెలుసా? ఆమె మనందరికీ తెలిసిన స్టార్ నటి.. ఎవరో...

ఛత్రపతి నటుడు భార్య గురించి మీకు తెలుసా? ఆమె మనందరికీ తెలిసిన స్టార్ నటి.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

చంద్రశేఖర్.. చత్రపతి సినిమాలోని భద్ర పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో చంద్రశేఖర్ ఎక్కువగా కనిపిస్తాడు. బాహుబలి సినిమాలో తప్ప రాజమౌళి అన్ని సినిమాల్లో చంద్రశేఖర్ నటించారు. రాజమౌళి మొదటి చిత్రమైన స్టూడెంట్ నెంబర్ వన్ అలాగే చంద్రశేఖర్ కూడా ఇదే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టారు. చంద్రశేఖర్, రాజమౌళి సినిమాలే కాకుండా ఇంకా అనేక సినిమాల్లో నటించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సాధించారు. అలాంటి చంద్రశేఖర్ భార్య గురించి చాలామందికి తెలియదు. ఆయన భార్య పేరు భవాని. ఈమె కూడా సినిమాల్లో యాక్టర్ కావడం విశేషం.

తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాకు చెందిన భవానీని సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కెరీర్ లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇద్దరు సినిమా అవకాశాల కోసం ట్రై చేశారు. ఈమె సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సాధించింది. పండగ చేసుకో, కిట్టు, జెంటిల్మెన్ వంటి చాలా సినిమాల్లో కూడా నటించింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వివిధ కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. వీరికి ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. ఈమె తెలుగుతో పాటుగా తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది.

ss ఇదేనిజం ఛత్రపతి నటుడు భార్య గురించి మీకు తెలుసా? ఆమె మనందరికీ తెలిసిన స్టార్ నటి.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Recent

- Advertisment -spot_img