ఎన్నికలప్పుడు తరచూ EVM అనే మాట వినిపిస్తుంది. EVM అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్. ఓటర్లు వేసిన ఓట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేసి లెక్కిస్తుంది. ఓట్లు వేసే సమయంతో పాటు లెక్కింపు సమయాన్ని కూడా తగ్గిస్తుంది.
హైసెక్యూరిటీ ఫీచర్లతో తయారు చేయడంతో వీటిని హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇవి విద్యుత్పై ఆధారపడకుండానే పని చేస్తాయి. వేసిన ఓటును మాత్రమే నమోదు చేస్తాయి.