ఉప్పులో వివిధ రకాల గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు వెదురుతో తయారవుతుందని మీకు తెలుసా?. ఈ ఉప్పును వెదురు ఉప్పు అని అంటారు. మార్కెట్లో వెదురు ఉప్పు ధర కిలోకు రూ.20 వేల నుండి రూ.30 వేల వరకు ఉంటుంది. ఈ దీనితో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఉప్పును మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వెదురు ఉప్పు ఒక కిలో తయారు చేయడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. ఈ ఉప్పులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. జీర్ణ సమస్యలకు వెదురు ఉప్పు బాగా పనిచేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే ఇంత ధర ఉంటుందని తెలుస్తుంది.