మన దేశంలో అందరికంటే ముందు నిద్రలేస్తుందా గ్రామం. దోంగ్ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. సూర్యుడు ఐదింటికే వచ్చి పలకరిస్తాడు. సముద్రమట్టానికి 1, 240 మీటర్ల ఎత్తులో ఉంది దోంగ్. ఓ వైపు చైనా, మరో వైపు మయన్మార్ దేశాలు. దోంగ్ మన దేశానికి తూర్పు ముఖద్వారమే కానీ, ఇక్కడ పర్యటిస్తుంటే మన దేశంలో ఉన్నామనే భావన కలగదు. ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యతను ఈ దోంగ్ టూర్‌లో ఆకళింపు చేసుకోవచ్చు.