Homeహైదరాబాద్latest Newsభర్త కి భార్య ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసా.. భర్త ప్రేమను పొందాలంటే ఇలా చేయండి..!

భర్త కి భార్య ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసా.. భర్త ప్రేమను పొందాలంటే ఇలా చేయండి..!

భర్త కి భార్య ఎలా ఉంటే నచ్చుతుందో.. భర్త ప్రేమను మరింత పొందాలన్నా ఈ కింది వాటిని తప్పకుండా ఫాలో అవ్వాలి.

  1. రోజంతా ఆఫీస్‌లో పనిచేసిన భర్త చాలా అలసిపోతాడు. అతను అలా ఒత్తిడికి గురైనప్పుడు మీరు మీ భర్తపై ఒత్తిడి చేయకుండా ఒత్తిడి తగ్గేలా ఏదైనా చేయాలి. ఎత్తిడిని తగ్గించే మాటలను మాట్లాడాలి. మీ మాటలు ఒత్తిడిని పెంచనంతకాలం మీరు మీ భర్తకు ఇబ్బందిని కలిగిస్తున్నట్లే. ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి.
  2. భర్తకు ఏది చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని స్పష్టం చెప్పాలి. ఈ విషయంలో ఎటువంటి సంకోచాన్ని, అనుమానాన్ని, భయాన్ని పెట్టుకోవద్దు. మీకు ఏది అనిపిస్తే అది చెప్పేయాలి. కానీ దానికి కూడా సమయం, సందర్భాన్ని చూసుకోవాలి. భాషను కూడా సవ్యంగా ఉపయోగించాలి. భర్తపై అరవడం, తిట్టడం లాంటివి చేయవద్దు.
  3. కొంతమంది భార్యలు.. నేను అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు. ఇది అహంకారానికి ప్రతీక. ఇలాంటి పదాలను ఉపయోగించకూడదు. ఇలాంటి స్టేట్‌మెంట్లవల్ల భర్త తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఇద్దరినీ కలిపి సంబోధించడం వల్ల గొడవలు రాకుండా వుంటాయ్.
  4. భర్త చెప్పే విషయాలను భార్య క్షున్నంగా వినాలి. తొందరపడకూడదు. భర్త చెప్పే మాటలు వినకుండా ఏది అంటే అది మాట్లాడవద్దు. ఇలా చేయడం వల్ల భార్యపై వుండే నమ్మకాన్ని కోల్పోతాడు. ఈ విషయంలో భార్యలు చాలా జాగ్రత్తగా వుండాలి.
  5. భర్తకు నచ్చని విషయాలను పదే పదే తీసుకొని రావద్దు. అలా చేయడం వల్ల మీ భర్తకు మీరు మరింత కోపాన్ని కలిగించిన వారౌతారు. మీకు వున్న సమస్యను ప్రశాంతంగా మీ భర్తకు తెలియజేయండి.
  6. నేరుగా మాట్లాడకుండా సైగలతో కూడా మీ భర్తకు నచ్చిన విధంగా వుండండి. మీరు ఏమి చెబుతున్నారో సైగల ద్వారా, మీ బాడీ ల్యాంగ్వేజ్ ద్వారా మీ భర్తకు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
  7. మీకు వున్న సమస్యను భర్తకు చెప్పినప్పుడు దాని పై అతని స్పందన ఎలా వుందో తెలుసుకోవడానికి అతనికి కొంత సమయం ఇవ్వాలి. మీ భర్త దానిపై సానుకూలంగా స్పందించకపోతే నిరాశ చెందకుండా మీ భర్తతో సంతోషంగా వుండేలా ముందుకు వెళ్లండి.
  8. ఇద్దరి మధ్యా గొడవవచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. రాజీ అయ్యేలా చూడాలి. కానీ సమస్య మరింత పెరిగేలా చేసుకోవద్దు. మెగ్గలోనే సమస్యను తుంచివేయాలి.
  9. మీ మాటను మీ భర్త విన్నప్పుడు అతన్ని మెచ్చుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు సంతోషంగా కృతఘ్నతగా వుండాలి. భర్త చెప్పేది వినడానికి భార్య సిద్ధంగా వుండాలి. ఇద్దరూ మాట్లాడుకోలేని పరిస్థితి వస్తే అప్పుడు కౌన్సిలింగ్ సెంటర్లను ఆశ్రయించాలి.
  10. భర్తను ప్రేమించడం మాత్రమే కాదు, భర్తకు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. అలా గౌరవించినప్పుడు భార్య మరింత ప్రేమను భర్త నుంచి పొందుతుంది. భర్తకు భార్య నుంచి అవమానం జరిగితే భర్త భార్యపై కొంత ప్రేమను తగ్గిస్తాడు. అది పెరిగితే ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. స్త్రీలు అవమానాలను తట్టుకోవడం, పురుషులు అవమానాలను తట్టుకోవడం రెండూ వేరు. భార్య నుంచి భర్త అవమానాన్నిఎదుర్కొన్నప్పుడు దాంపత్య జీవితంలో సమస్యలు మొదలౌతాయ్. కాబట్టి భార్య భర్తకు గౌరవం విషయంలో జాగ్రత్తగా వుండాలి. పైవాటిని ఫాలో అయితే ఇద్దరి దాంపత్య జీవితం సుఖంగా వుంటుంది.

Recent

- Advertisment -spot_img