సినీ పరిశ్రమలో పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవలే చాలామంది విడాకులు తీసుకోవడం సినీ పరిశ్రమలో అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ఇక ఈ ఒక్క సంవత్సరంలోనే చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకుందాం… ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2022లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న జంట 27 నవంబర్ 2024న కోర్టు నుండి ఆమోదం పొందింది.
ప్రముఖ సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ 2013లో సింగర్ సైంధవిని పెళ్లాడగా.. 2020లో వారికి ఓ పాప కూడా పుట్టింది. అప్పటి నుంచి తమ వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుందని అందరూ అనుకునేలోపే ఈ ఏడాది ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ 1995లో సైరా భానుని పెళ్లాడారు.. 29 ఏళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగినా.. ఇప్పుడు తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ హీరోయిన్ ఊర్మిళ తన భర్త మోసిన్ అక్తర్ మీర్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 2016లో పెళ్లి చేసుకున్న ఈ జంట 8 ఏళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో జయం రవి 18 ఏళ్లు కలిసి కాపురం చేసిన జయం, రవి ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. హీరో జయం రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత జయం రవి సతీమణి ఆర్తి అతనిపై ఆరోపణలు చేసింది.