ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కో ఈవీఎంలో పోల్ అయిన ఓట్లను లెక్కించడానికి ఎంత సమయం పడుతుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల అధికారుల లెక్కల ప్రకారం.. ఒక ఈవీఎంలో పోలైన ఓట్లను లెక్కించడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. మొదటి రెండు రౌండ్లు లెక్కించడానికి మాత్రం గంట సమయం పడుతుంది.