Homeఫ్లాష్ ఫ్లాష్ప్ర‌భాస్ ‘కల్కి’ మూవీ లో కమల్ హాసన్ స్క్రీన్ టైమ్ ఎంతో తెలుసా..?

ప్ర‌భాస్ ‘కల్కి’ మూవీ లో కమల్ హాసన్ స్క్రీన్ టైమ్ ఎంతో తెలుసా..?

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ రన్ టైమ్ పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాల పాటు తెరపై కనిపించనున్నారని తెలుస్తుంది. అలాగే పార్ట్ 2 లో 90 నిమిషాల వరకు ఉంటుందని అంటున్నారు. కమల్ హాసన్ పాత్రపై ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Recent

- Advertisment -spot_img