పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితమే అవి ఏంటంటే.. పెట్రోల్, డీజిల్ నాణ్యత, పరిమాణంను చెక్ చేసుకోవచ్చు. ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స కిట్, అగ్నిమాపక యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫోన్, టాయిలెట్స్‌ను వినియోగించుకోవడంతో పాటు, మంచినీళ్లను తాగొచ్చు లేదా సీసాలో నింపుకోవచ్చు. టైర్లకు గాలి కూడా పట్టొచ్చు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పై 6 సౌకర్యాలను వినియోగదారులకు ఉచితంగా కల్పిస్తేనే పెట్రోల్ బంక్ నడపడానికి లైసెన్స్ లభిస్తుంది.