మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన డీపీఆర్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 24,269 కోట్ల అంచనాలతో మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి.