ఖాళీ కడుపుతో జీలకర్ర నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..
- జీర్ణక్రియకు సహాయపడుతుంది: జీలకర్రలో ఉండే యాంటీ-గ్యాస్ రసాయనాలు జీర్ణ ప్రోటీన్ల కార్యకలాపాలను పెంచి, జీర్ణవ్యవస్థను సజావుగా పనిచేయడానికి సహాయపడతాయి.
- జీలకర్ర నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
- రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి:
షుగర్ వ్యాధితో బాధపడేవారికి జీలకర్ర నీళ్లు మంచి మందు. - జీలకర్ర నీళ్లు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, రక్తపోటు తగ్గుతుంది.
- బరువును అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరం ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- మలబద్ధకం, మానసిక ఒత్తిడి తగ్గుతాయి. ముఖ్యంగా గుండె, లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.