జపాన్లో పండించే ‘కిన్మెమాయి’ అనే రకానికి చెందిన ఈ బియ్యం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం. జపాన్లోని టోయో రైస్ కార్పొరేషన్ ఐదురకాల వరి వంగడాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, పండిస్తోంది. ఈ బియ్యం కిలో ప్యాకెట్లలోను, బస్తాల్లో కాకుండా, 140గ్రాముల ఆరు సాచెట్లు నింపిన ప్యాకెట్లలో విక్రయిస్తుండటం విశేషం. ఈ బియ్యం ధరలు కిలోకు 109డాలర్ల నుంచి 155డాలర్ల వరకు ఉంటాయి.