IPL robotic dog: ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో, మైదానంలో ఒక డాగ్ రోబోటిక్ బొమ్మ కనిపిస్తుంది. కానీ ఈ రోబోను ఏమని పిలుస్తారో మీకు తెలుసా? ఈ రోబోకు ఏ పేరు పెట్టారో తెలుసా?.. ఐపీఎల్ 2025 సీజన్‌లో గ్రౌండ్‌లో కనిపించే రోబోటిక్ డాగ్‌కు ‘చంపక్’ అని పేరు పెట్టారు. ఇది ఫ్యాన్స్ ఓటింగ్ ద్వారా ఎంపికైన పేరు, మరియు ఐపీఎల్ అధికారిక ఖాతా దీన్ని “మీట్ చంపక్” అని ట్వీట్ చేసి ప్రకటించింది. చంపక్ ఇప్పటికే ఆటగాళ్లతో సరదాగా సంభాషిస్తూ, మహేంద్ర సింగ్ ధోనీతో వైరల్ వీడియోలో కనిపించి అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే.