Homeఆరోగ్యంవీటి పేరు మీకు తెలుసా? అవి ఎంత రుచిగా ఉంటాయో.. అంతే ఆరోగ్యకరం..!

వీటి పేరు మీకు తెలుసా? అవి ఎంత రుచిగా ఉంటాయో.. అంతే ఆరోగ్యకరం..!

తేగలు… ఇవి తాటి చెట్ల నుంచే వస్తుంది. తేగ ఇంకేంటో కాదు తాటి కాయను పాతితే వచ్చే మొలక. తాటికాయల్లో టెంకలు ఉంటాయి. వాటిని తీసి మట్టిలో పాతితే మొలక వస్తుంది. ఆ మొలకలే తేగలు. ఈ తేగల్ని కుండల్లో నింపి మంట మధ్యలో పెడతారు. లోపలున్న తేగలు బాగా ఉడుకుతాయి. తరువాత ఆ కుండని తీసి లోపలున్న తేగలను బాగా దులిపి కట్టలు కడతారు. తేగ మధ్యలో చీలికలాగా ఉంటుంది. అక్కడ చీల్చితే రెండు బద్దలుగా విడిపోతుంది. ఆ బద్దలను తినాలి. కాల్చిన తేగలు చాలా రుచిగా ఉంటాయి. అయితే తేగలు తినడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వంటివాటిని అడ్డుకోవచ్చు. వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు దరిచేరవు. వీటిలో పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పీచు, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. తేగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. పెద్ద పేగుల్లో మలినాలు చేరకుండా, టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది.

Recent

- Advertisment -spot_img