విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15 వ తేదీన అనుష్క పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిందని విరాట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అనుష్క, తమ ఇన్‌స్ట్రాగ్రామ్ హ్యాండిల్స్‌లో పండంటి మగబిడ్డ పుట్టాడని ఓ గ్రీటింగ్ కార్డ్ షేర్ చేస్తూ ఆ అబ్బాయికి అకాయ్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. పుట్టిన బాబు ఫొటో మాత్రం షేర్ చేయలేదు. టర్కిష్ భాషలో అకాయ్ అంటే మెరిసే చంద్రుడు అని అర్థం వస్తుందట. ముందుగా పుట్టిన కూతురు పేరు వామిక. వామిక అంటే దుర్గ మాత మరో పేరుగా విరుష్క దంపతులు చెప్పుకొచ్చారు.