టీడీపీతో బీజేపీ సంబంధాలు నిలకడగా లేవు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు కూటమి నుంచి బయటకు వచ్చేశారు. అదే సమయంలో ఆయన కార్యాలయాలపై ఐటీ దాడులు కూడా జరిగాయి. 2023లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో జోక్యం ఉందనే ఆరోపణలతో అరెస్టు చేయడంతో 50 రోజులు జైలు జీవితం అనుభవించారు. తాజాగా ఎన్నికల ప్రచార సమయంలోనూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇడి, ఐటి దాడులు తప్పవంటూ బాబు వ్యాఖ్యలు చేశారు.