Homeహైదరాబాద్latest Newsభారతదేశంలో అత్యంత ఖరీదైన టాప్-5 ఇళ్ళు ఎవ‌రివో తెలుసా? వాటి ఖరీదెంతో తెలిస్తే అవాక్కవుతారు..!

భారతదేశంలో అత్యంత ఖరీదైన టాప్-5 ఇళ్ళు ఎవ‌రివో తెలుసా? వాటి ఖరీదెంతో తెలిస్తే అవాక్కవుతారు..!

భారతదేశంలోని టాప్-5 అత్యంత ఖరీదైన ఇళ్లను పరిశీలిస్తే… భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు. యాంటిలియా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు. ఈ యాంటిలియా, రూ.12,000 కోట్ల అంచనా ధరతో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా నిలిచింది. ఈ నివాసంలో చాలా ఖరీదైన వస్తువులు కూడా ఉన్నాయి. ఇకేనా JK హౌస్ భారతదేశంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు. రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా యొక్క JK హౌస్ విలువ సుమారు ₹6000 కోట్లు విలువ ఉంటుంది. దక్షిణ ముంబైలో ఉన్న ఈ 30-అంతస్తుల భవనం ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. భారతదేశంలో మూడవ అత్యంత ఖరీదైన ఇల్లు అబోడ్, ఇది అనిల్ అంబానీ ఇల్లు. దీనికి కూడా దాదాపు 6 వేల కోట్లు ఖర్చు అయింది. ఇది 16,000 చదరపు అడుగుల విస్తీర్ణం మరియు హెలిప్యాడ్‌తో 70 మీటర్ల ఎత్తుతో భారతదేశంలోని మూడవ అత్యంత ఖరీదైన ఇల్లు. ఇంకా KM బిర్లా హౌస్ భారతదేశంలో నాల్గవ స్థానంలో ఉంది. దీని విలువ దాదాపు రూ. 425 కోట్లు ఉంటుంది. ఈ ఇల్లు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మన్నాత్ భారతదేశంలోని ఐదవ అత్యంత ఖరీదైన ఇల్లు. ఇది షారుఖ్ ఖాన్ ఇల్లు. ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న ఈ ఆరు అంతస్తుల భవనం విలువ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఇల్లు 27000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంది.

Recent

- Advertisment -spot_img