కొందరి లైఫ్ పార్టనర్స్ అలవాట్లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వారు, వారి పార్టనర్ ఆలోచనా విధానం చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. వివాహ జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రేమ లేని ఎలాంటి బంధాలు ఎక్కువ రోజులు సాగవు. ఈ కారణంగా పెళ్ళి బంధం నరకంగా మారి గొడవలు, కొట్లాటలు చివరికీ విడిపోయే పరిస్థితి వస్తుంది. లైఫ్ పార్టనర్స్ కి ఇలా జరగకుండా ఉండాలంటే పెళ్ళి చేసుకోవాలనే వారిని సరిగ్గా ఎంచుకోవాలి. అలా కాకుండా అర్ధం చేసుకునే వ్యకిత్వం లేని వారిని చేసుకుంటే జీవితాంతం భాధ పడాల్సి వస్తుంది. అలాంటి వ్యక్తిత్వాలు ఏంటో తెలుసుకోండి.
అబద్ధాలు చెప్తూ ఉండడం..
మీరు పెళ్లి చేసుకొవాలని వాళ్ళు మీకు తరచుగా అబద్ధం చెప్పే వాళ్ళు అయితే వారిని పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది. అలాంటి వ్యక్తులు నిజాలు చెప్పకపోగా మీ జీవితాన్ని సైతం నరకంగా మారుస్తారు. దీంతో మీరు మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది. అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది.
మోసం చేసే వాళ్ళు..
మనం పెళ్ళి చేసుకోబోయే వారికీ మోసం చేసే గుణాలు ఉంటే, వారికీ దూరంగా ఉండడం, కుదిరితే అసలు పట్టించుకోకపోవడం చాల ప్రశాంతమైన పని. అలాంటి వారు మిమల్ని ఎలాంటి విషయాల్లో ఐనా సరే సులభంగా మోసం చెయ్యగలరు. వాళ్ళ సంతోషం కోసం ఎంతటి తప్పైనా చేస్తారు. అలాంటి వారిని పెళ్ళి చేసుకుంటే భాధలు కొని తెచ్చుకున్నట్లే.
స్వార్ధపరులు..
కొంతమంది స్వార్ధంతో వుండే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచిస్తూ, ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేస్తూ వుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇంకేమైనా స్వంత ప్రయోజనాల కోసం వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ వుంటారు. అలాంటి వారిని కూడా నమ్మి పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది.
స్థిరత్వం లేనివారు కూడా..
ఎలాంటి స్థిరత్వం లేనివారు కూడా తమ ఆనందాల కోసం ,అవసరాల కోసం విచ్చలవిడిగా మాటలు మారుస్తూ వుంటారు. వారిని పెళ్ళి చేసుకున్నా మానసికంగా కుంగిపోతారు. ఎప్పటికప్పుడు అనవసరపు మాయ మాటలు చెప్తూ, కలహాలు కొని తెచ్చుకుంటారు. వారికి ఎలాంటి నిబద్ధత ఉండదు. ఎంతసేపు అప్పటికప్పటి గురించి మాత్రమే తప్ప భవిష్యత్ గురించి ఎలాంటి ఆలోచన ఉండదు.