పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి. మను బకర్, సరబ్జోత్ సింగ్, స్వప్నిల్ పతకాలు అందుకున్నారు. కానీ ఈ ముగ్గురిని పతకాలు మరియు పొడవాటి పెట్టెను ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెట్టెలో అసలు ఏముందని అందరూ తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో విజేతలు పోడియంపై నిలబడి పతకాన్ని అందుకుంటారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి స్వర్ణం, రన్నరప్‌గా నిలిచిన వారికి రజతం, కాంస్యం అందజేయడం సర్వసాధారణం. అయితే ఈసారి మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఓ పెట్టె ఇస్తున్నారు. అయితే అందులో ఖరీదైన బహుమతి ఏమీ లేదు. ఇందులో పారిస్ ఒలింపిక్స్ అధికారిక పోస్టర్ ఉందని తెలుస్తుంది. 40 సెంటీమీటర్ల కార్డ్‌బోర్డ్ పెట్టెలో ఖరీదైన బహుమతి ఉందని చాలా మంది భావించారు. కానీ అందులో పోస్టర్ మాత్రమే ఉంది. ఆతిథ్య దేశమైన ఫ్రాన్స్‌కు చెందిన ఆర్ట్ డైరెక్టర్ ఉగో గటోని ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.