Homeతెలంగాణవీవీప్యాట్ స్లిప్పులను ఎప్పుడు లెక్కిస్తారో తెలుసా..?

వీవీప్యాట్ స్లిప్పులను ఎప్పుడు లెక్కిస్తారో తెలుసా..?

రేపటి కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.జూన్‌ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయి. వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఒకవేళ కౌంటింగ్​ సమయంలో కూడా కొన్ని ఈవీఎంలు మొరాయిస్తే.. అప్పుడు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. అభ్యర్థుల గుర్తుల వారీగా బాక్సులు ఏర్పాటు చేసి, వారికి పోలైన స్లిప్పులను అందులో వేస్తారు. ఆ తర్వాత లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్ యంత్రంలోని స్లిప్పులు లెక్కబెట్టాలంటే దాదాపు గంట పడుతుంది. అయితే వీవీప్యాట్‌లు లెక్కించాల్సి వస్తే.. అన్నీ ఒకేసారి ఓపెన్ చేయరు. ఒకదాని తర్వాత మరొకటి తెరిచి లెక్కిస్తారు.

Recent

- Advertisment -spot_img