Homeహైదరాబాద్latest Newsఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'కేసీఆర్' మూవీ.. ఎక్కడో తెలుసా..?

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘కేసీఆర్’ మూవీ.. ఎక్కడో తెలుసా..?

జబర్దస్త్‌ కమెడియన్ రాకింగ్‌ రాకేష్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కేశవ చంద్ర రమావత్‌ (కేసీఆర్‌). ఈ సినిమాకు గరుడ వేగ అంజి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్ బ్యానర్‌పై రాకింగ్‌ రాకేశ్‌ నిర్మించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పేరుతో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది.ఈ సినిమాలో కేసీఆర్ పై అభిమానం, ఏం చేసినా ఎదురు తిరగడం తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొన్న అవమానాలు 60 ఏళ్ల పరాయి పాలన కష్టాలు చాలా బాగా చూపించారు.ఈ సినిమాలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఎంతలా ఆదర్శంగా తీసుకున్నారో చూపించారు. ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా శనివారం నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ఈ ప్రసారం అవుతుంది.

Recent

- Advertisment -spot_img