ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా సోమవారం కేవలం 33.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో 4 వికెట్లకు 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (33), రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు. కాగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేయగా భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది.