ప్రస్తుతం హీరోయిన్లు, క్రికెటర్లు మధ్య డేటింగ్ వార్తలు వస్తూనే ఉంటాయి. చాలా మంది డేటింగ్ చేసి ఆ తరువాత విడిపోతారు. వారిలో హీరోయిన్ ఇషా శర్వాణి ఒకరు. బాలీవుడ్‌లో ఇషా శర్వాణి కి మంచి గుర్తింపు ఉంది. ఈ భామ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. అందుకు కారణం తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని సమస్యలే. అప్పట్లో నటి ఇషా శర్వాణి, టీమిండియా స్టార్ క్రికెటర్ జహీర్ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండేది. ఈ జంట తమ డేటింగ్ సమాచారాన్ని అధికారికంగా బహిరంగంగా పంచుకోనప్పటికీ, వార్తలను ధృవీకరించడానికి ఇద్దరూ తరచుగా కలిసి కనిపించేవారు. ఇషా శర్వాణి, జహీర్ ఖాన్ ఎనిమిదేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారని సమాచారం. ఆ తర్వాత 2012లో ఈ జంట విడిపోయింది. తర్వాత జహీర్ ఖాన్ గుడి పడ్వాను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ నటి ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఈ హీరోయిన్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. సినిమాలో ఛాన్స్ కావాలంటే తనతో పడుకోమని ఓ ప్రముఖ నటుడు అడిగాడని ఒక ఇంటర్వ్యూలో ఇషా వెల్లడించింది, ఈ వార్త సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ విషయం బి-టౌన్‌లో చర్చకు దారితీసింది.