భారత్లో రిచెస్ట్ సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (రూ. 931కోట్లు) నిలిచారు. ఆయన చరాస్తుల విలువ రూ. 810cr కాగా స్థిరాస్తుల విలువ రూ.121crగా ఉంది. ఇక ఈ లిస్టులో అరుణాచల్ సీఎం పెమా ఖండు (రూ.332cr) రెండో స్థానంలో, కర్ణాటక ఏపీ సిద్దరామయ్య (రూ.51cr) మూడో స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (రూ.15 లక్షలు) నిలిచారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ ₹55లక్షలు, కేరళ సీఎం విజయన్ ₹1.18 కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న 31మంది ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసుల వివరాల జాబితాను విడుల చేయగా.. 31మంది ముఖ్యమంత్రుల ఆస్తులు రూ.1,630 కోట్లుగా నివేదిక పేర్కొంది.