టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రియమణి. 2009లో తెరకెక్కిన రామ్ సినిమా ద్వారా కన్నడ సినీ రంగానికి పరిచయమైంది. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించిన ప్రియమణి పలు హిందీ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా కనిపించింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడు సినిమాల్లో లీడింగ్ రోల్స్ లో నటిస్తోంది. ఈ మద్య ప్రియమణికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ప్రియమణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యాబాలన్ తన దగ్గరి బంధువని ప్రియా పేర్కొంది.