అక్కినేని వారసులగా సినిమా ఇండస్ట్రీలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌లు సినిమాలు చేస్తున్నారు. నాగార్జున అట్టు మాస్ సినిమాలు చేస్తూనే ఫామిలీ సినిమాలు చేసి తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు బిగ్ బాస్ రియాలిటీ షో చేస్తున్నాడు. నాగార్జున కుమారులు సినీ నాగ చైతన్య, అఖిల్ తమ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ ముగ్గురు అక్కినేని వారసులతో కలిసి ఒక హీరోయిన్ఈ నటించింది. ఆ హీరోయిన్ పేరు పూజా హెగ్డే.. ఈమె నాగ చైతన్యతో ”ఒక లైలా కోసం” అనే సినిమా చేసింది. అలాగే అఖిల్ తో ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమాలో నటించింది. అయితే నాగార్జునతో మాత్రం సినిమాలు చేయలేదు కానీ.. యాడ్స్ చేసింది. దీంతో పూజా హెగ్డే ఈ ముగ్గురి అక్కినేని హీరోలుతో నటించింది.