బంగారం ఉష్ణ వాహకంగా పనిచేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతకు వేగంగా చేరుకుంటుంది. అందుకే బంగారంతో నగలు తయారు చేస్తారు. ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్‌లో ఉపయోగించకపోవడానికి కారణం బంగారం ఖరీదైనది కావడమే. కంప్యూటర్లు, టీవీలు, కెమెరాలు, రేడియోలు, మీడియా ప్లేయర్స్‌లో కొంత బంగారం ఉంటుంది. బంగారం తక్కువ నష్టంతో అధిక వేగంతో డిజిటల్ డేటా ప్రసారాన్ని సమర్థవంతంగా సులభతరం చేస్తుంది. దీన్ని నాశనం చేయలేం. పైగా తుప్పు పట్టదు. చెడిపోదు.