Homeహైదరాబాద్latest Newsవిజయదశమి నాడు జమ్మి చెట్టును ఎందుకు కొలుస్తారో తెలుసా..?

విజయదశమి నాడు జమ్మి చెట్టును ఎందుకు కొలుస్తారో తెలుసా..?

రామాయణం, మహాభారతాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ బట్టల్ని, ఆయుధాల్ని జమ్మి చెట్టుపైన దాచి ఉంచారు. అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టుకి పూజలు చేసి ఆయుధాల్ని దించి కౌరవ సేనని తరిమికొట్టారు. అందుకే అప్పటి నుంచి విజయదశమి నాడు జమ్మి చెట్టుని దేవీ ప్రతిరూపంగా కొలుస్తారు. జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటూ అలయ్​– బలయ్​ చేసుకుంటారు.

హిందూ పురాణాల్లో జమ్మి చెట్టు ప్రాధాన్యత
జమ్మి చెట్టుకు హిందూ పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. క్షీరసాగర మధనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా పుట్టాయి. వాటిల్లో జమ్మిచెట్టు కూడా ఒకటి. దీన్ని సంస్కృతంలో శమీ వృక్షం అంటారు. యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడు.. ముందుగా జమ్మిచెట్టు కర్రలతో నిప్పు పుట్టించేవారు. లంకకు శ్రీరాముడు వెళ్ళేటప్పుడు జమ్మి ఆకులతో ఆది పరాశక్తిని పూజించినట్టు చరిత్ర చెబుతుంది.

Recent

- Advertisment -spot_img