శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసంలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇంటి పెద్దలు తమ కుటుంబ సభ్యులందరికీ ఈ నెలలో నాన్ వెజ్ తినకూడదని సలహా ఇస్తారు. కొందరు శ్రావణమాసంలో తమ ఆరాధ్యదైవం పేరుతో ఒక నెలపాటు ఈ సంపూర్ణ శాఖాహారాన్ని పాటిస్తే, మరికొందరు పండుగల సమయంలో మాంసాహారం తినడం వల్ల పూజకు అపవిత్రం అవుతుందని భావించి శాఖాహారం పాటిస్తారు. అయితే వీటన్నింటికీ మించి మన పెద్దలు ఒక శాస్త్రీయ కారణాన్ని కనుగొన్నారు. శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో కోళ్లు, ఇతర జంతువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో శరీరంలో జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి మందగిస్తుంది. ఇలాంటప్పుడు మాంసం తినడంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.