స్త్రీల కంటే పురుషులు శారీరకంగా బలంగా ఉంటారు. పురుషులు దాదాపు ఎల్లప్పుడూ స్త్రీల కంటే ఎత్తుగా ఉంటారు. అయితే వారు తలెత్తుకొని మగవారిని చూడటానికి కారణమవుతున్న హార్మోన్ ‘టెస్టోస్టెరాన్’. ఇది ఎముక పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అయితే స్త్రీలలో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎముకల పెరుగుదలను నియంత్రిస్తుంది. కొందరు స్త్రీలు పురుషుల కంటే ఎత్తు ఉండటానికి కారణమేంటంటే.. తల్లిదండ్రుల ఎత్తు, జన్యుపరమైన మార్పులని చెప్పవచ్చు.