నిద్రపోయేటప్పుడు మీ తల దగ్గర మొబైల్ పెట్టుకుంటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ తరచుగా నిద్ర భంగం కలిగిస్తుంది. పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే క్యాన్సర్, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇంకా తలనొప్పి, కండరాల నొప్పి మొదలైన సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు వీలైనంత వరకు ఫోన్‌ను దూరంగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.