ట్విటర్లో 2500 మంది కన్నా ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూజర్లకు బ్లూటిక్ పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నట్లు X తెలిపింది. ప్రీమియం ఫీచర్లనూ అందివ్వనున్నట్లు స్పష్టం చేసింది. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవారికి పూర్తి ఉచితంగా ప్రీమియం ప్లస్ ఫెసిలిటీస్ కల్పిస్తామని గతవారం ఎలన్ మస్క్ చెప్పిన సంగతి తెలిసిందే. ట్విటర్ తీసుకున్న ఈ నిర్ణయంపై యూజర్తు హర్షం వ్యక్తం చేస్తున్నారు.