Homeహైదరాబాద్latest Newsఏ కులము సారు దంటే.. మీకు కొత్తగా వచ్చిన అధికారి కులము తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే వెరీ...

ఏ కులము సారు దంటే.. మీకు కొత్తగా వచ్చిన అధికారి కులము తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే వెరీ ఈజీ..!

కొత్త కొత్త ప్రభుత్వ అధికారి బదిలీ అయ్యి, కొత్త కొత్త పోస్ట్‌లో చేరినప్పుడు, అతని కులం తెలుసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కొత్తగా వచ్చిన అధికారి మన వాడా కాదా అని తర్జన భర్జన పడుతుంటారు. అయితే వచ్చిన అధికారి పేరు చివర రెడ్డి, గౌడ్, ముదిరాజ్ ఇలా కులం ను తెలిపే తోకలు ఉంటే ఆ ప్రాబ్లెమ్ ఉండదు. అయితే అధికారి పేరు చివర ఈ తోకలు లేకుంటే.. ఎలా తెలుసుకోవడం..?
కానీ తెలుసుకోవచ్చు.. దీనికి కూడా ఒక టెక్నిక్ వుంది. కాస్త బుర్ర పెట్టి గమనించినట్లయితే వెరీ ఈజీ. ఆ సదరు అధికారి బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఎవరు చాలా ఉత్సాహంతో వచ్చి పూల మాలలతో అధికారిని సన్మానించి ఫోటోలు దిగుతారో.. వారిది ఏ కులమో ఆ అధికారి కూడా 100% అదే కులం అయి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి కుల ధోరణి లేదు. గతం లో ఇటువంటి కుల ధోరణి ట్రెండ్ లేకుండే.. ఈ మధ్యకాలంలో ఈ కుల గుల ట్రెండ్ ముదిరిపోయింది. అందుకే ఈ చిట్కాను.. ఏ కులము సార్ ది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక సారి మీరు ట్రై చేయండి..

Recent

- Advertisment -spot_img