Homeహైదరాబాద్latest Newsచిరంజీవి సినిమాలో ఆ సీన్ వల్ల డాక్టర్ల జీవితాలు నాశనమయ్యాయి.. ప్రముఖ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు

చిరంజీవి సినిమాలో ఆ సీన్ వల్ల డాక్టర్ల జీవితాలు నాశనమయ్యాయి.. ప్రముఖ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ‘ఠాగూర్’. ఈ సినిమాకి వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. ‘ఠాగూర్’ సినిమా 2003లో విడుదలైంది. ఈ సినిమాలో హాస్పిటల్ సీన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సీన్ వల్ల డాక్టర్ల జీవితాలు నాశనమయ్యాయని అన్నారు ప్రముఖ డాక్టర్ గురవ రెడ్డి. ఆ సీన్‌లో డాక్టర్లు చెత్తగా చూపించారని విమర్శించారు. ‘ఆ సీన్‌ ఎవరు రాశారో తెలియదు కానీ.. వైద్య వృత్తికి మాత్రం చాలా నష్టం వాటిల్లిందిని.. చెప్పాలంటే చెత్త సీన్ అది. అది చూసిన ఎవరైనా డాక్టర్లు డబ్బు కోసం రోగులను ఐసీయూకి తీసుకెళ్తారని అనుకుంటారు. పొరపాటున పేషెంట్ చనిపోతే, వారు కారణం కాదని వైద్యులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నాకు క్లోజ్ ఫ్రెండ్. చిరంజీవి గారిని కలిసిన ఓ సందర్భంలో ‘ఠాగూర్’ సీన్ గురించి చెప్పాను. డాక్టర్లకి మనశ్శాంతి లేకుండా చేసిందని చెప్పాను. అయితే ఆ సీన్ ఇంకా చాలా దారుణంగా ఉందట. చిరంజీవిగారే దాన్ని కాస్త మార్పు చేశారు’ అని డాక్టర్ గురవారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img