ఇదే నిజం, మధిర: మధిర లో అత్యాధునిక మరియు ఎన్నో పెద్ద ఆపరేషన్ లు జరిగే కే వి ఆర్ హాస్పిటల్ నందు మరొక కలికితురాయి వచ్చి చేరింది. మధిర కి చెందిన ఒక యువకుడు కొన్ని సంవత్సరాలనుండి పాంక్రియాటైటిస్ వచ్చి పాంక్రీయాస్ కుళ్ళిపోయి విపరీతమయిన కడుపునొప్పితో బాధపడుతూ వున్నారు. వారు ఖమ్మం లోని ఒక హాస్పిటల్ లోని వైద్యులను సంప్రదించగా వారు ఆపరేషన్ కు లక్షల్లో ఖర్చు అవుతుంది అని చెప్పగా వారు కే వి ఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకొని వచ్చి డా. రాంబాబు గారిని కన్సల్ట్ అవ్వగా అతనికి స్కానింగ్ తీసి వారి వద్ద వున్న రిపోర్ట్స్ అన్నీ పరిశీలించి పాంక్రియాస్ కు పెద్ద కణితి వచ్చింది అని వారికి వివరించి ఆపరేషన్ చేయాలి అని తెలిపారు. ఎన్నో లక్షల్లో ఖర్చు అయ్యే ఆపరేషన్ ను వారి స్థోమత తెలుసుకొని అతి తక్కువ ఖర్చుతో ఆ పాంక్రియాస్ కు వచ్చిన కణితి ని తీసివేశారు. ఈ ఆపరేషన్ నిర్వహించుటలో డా.కోట రాంబాబు MS, మరియు కే వి ఆర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. తమకు ఎంతో ఖర్చు అయి దూరప్రాంతాలలో మాత్రమే జరిగే ఇలాంటి పెద్ద ఆపరేషన్ ను వారికీ తక్కువ ఖర్చుతో విజయవంతం చేసినందుకు వారు డా.కోట రాంబాబు కు మరియు హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డా. రాంబాబు మాట్లాడుతూ ఇటువంటి జబ్బులు ఎక్కువగా దీర్ఘకాలంగా ఆల్కహాల్ త్రాగే వాళ్లలో వస్తుంది అని కాబట్టి ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి అనికోరారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది అని పేషెంట్ కోలుకుంటున్నాడు అని తెలిపారు. పెద్ద ఆపరేషన్ లు సైతం ఇప్పుడు మన హాస్పిటల్ లో వున్న అత్యాధునిక పరికరాలతో ఉన్నత ప్రమానాలతో తక్కువ ఖర్చుతో ఇప్పుడు మన మధిర లోనే చేయగలగుతున్నాము అని తెలిపారు.